Search for:
  • Home/
  • क्षेत्र/
  • ప్రో కబడ్డీ క్రీడాకారులకు అండగా నిలిచిన ఉప్పల ఫౌండేషన్

ప్రో కబడ్డీ క్రీడాకారులకు అండగా నిలిచిన ఉప్పల ఫౌండేషన్

హైదరాబాద్: అక్టోబర్ 15(భారత్ కి బాత్)

అండర్ 14 ప్రో కబడ్డీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన నాగోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం నాడు యూనిఫాం, బూట్లు ఏసిపి నరేష్ రెడ్డితో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త అందజేశారు.

ఈ సందర్బంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ క్రీడాకారులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని, విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీయాలని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి సమాజానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలా కృషి చేస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో చదివి జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని తెలిపారు. ఏసీపీ నరేష్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రాణించాలని, చిన్నప్పటి నుండి క్రీడల మీద ఆసక్తి కలిగి వుండాలని అన్నారు. అనంతరం క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కోచ్ శంకర్, మమత, వెంకటేష్, రవి కుమార్, జయప్రద, మాధవి, విమల తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required