దుర్గామాత పూజలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్: అక్టోబర్ 11(భారత్ కి బాత్)
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ని శుక్రవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసిన ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ నిట్టు శ్రీశైలం. కరీంనగర్ చైతన్య నగర్ లో శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ నేతృత్వంలో అమ్మవారి పూజలు. శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాశక్తి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిదవ రోజు దుర్గామాత అమ్మవారు మహిషాసుర మర్దినిగా (సిద్ది రాత్రి) (మహర్నవమి) పసుపు, కుంకుమతో అమ్మవారిని అలంకరించారు. ఈ పూజలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, బిజెపి జాతీయ దళిత మోర్చా నాయకులు ఎస్. కుమార్, బిజెపి ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి, కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ నిట్టు శ్రీశైలం, బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కంజుల సుగుణ రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు.