మేడిగడ్డ కత్వా బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
తాత్కాలికంగా వెళ్ళటానికి రహదారిపై మరమ్మతులు చేపట్టాలని ఆదేశించిన ఎమ్మెల్యే
రంగారెడ్డి: సెప్టెంబర్ 11(భారత్ కి బాత్)
ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తాండ, శంకర్ కొండ తాండ గ్రామపంచాయతీల మధ్య నిర్మిస్తున్న కత్వా వాగు బ్రిడ్జి నిర్మాణ పనులను కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి బుధవారం మండలం పంచాయతీ రాజ్ ఏ.ఈ. అభిషేక్ గ్రామ ప్రజలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ కత్వా వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలకు రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మండల అధికారులకు ఆదేశించారు. అనంతరం ప్రజలకు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా వెళ్ళటానికి రహదారిపై మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్, సేవాదళం నాయకులు బాబా, మల్లేష్ నాయక్, సిద్దు నాయక్, దేవేందర్, హరిలాల్ తదితరులు పాల్గొన్నారు.