హస్తినాపూర్ లో నూతనంగా ప్రారంభమైన సారధి గ్రాండ్ హోటల్
రంగారెడ్డి: సెప్టెంబర్ 6(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హస్తినాపురం డివిజన్ లో నూతన సారధి గ్రాండ్ హెూటల్ గురువారం బి. యన్. రెడ్డి డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్లు మొద్దు లచ్చిరెడ్డి మరియు కార్పొరేటర్లు, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, సుజాత నాయక్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన రెస్టారెంట్ ప్రారంభించిన యజమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రెస్టారెంట్ కు వచ్చే ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యజమానులు శ్యామ్ సుందర్ రెడ్డి, ప్రదీప్ చారి, అరుణ్ రెడ్డి, సత్యనారాయణ, రాజు రెడ్డి, భూపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి మరియు యజమానుల కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.