వారాహి భవన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న శేఖర రావు పేరాల
హైదరాబాద్: ఆగష్టు 23(భారత్ కి బాత్)
ఐఎస్ సదన్ డివిజన్లోని భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి ఎదురుగా వినయ్ నగర్ కాలనీలో జి. దివ్యవాణి నేతృత్వంలో వారాహి భవన్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేఖర్ రావు పేరాల, ఐ ఎస్ సదన్ కార్పొరేటర్ శ్వేతా మధుకర్ రెడ్డి, సైదాబాద్ కార్పొరేటర్ అరుణ రవీందర్ రెడ్డి, ఆర్కే పురం కార్పోరేటర్ రాధ ధీరజ్ రెడ్డి హాజరై ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యం వారు మాట్లాడుతూ తమ హోటల్ లో టిఫిన్స్, బిర్యానీ, చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ అందరికీ అందుబాటు ధరల్లో లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యాకత్ పురా బీజేపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ వీరేందర్ యాదవ్ తో పాటు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.