మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
రంగారెడ్డి: జులై 14(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని అల్మాస్గూడ శ్రీశ్రీ హోమ్స్ ప్రక్కన మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ రాకేష్, డాక్టర్ శ్రీవేణి, డాక్టర్ దినేష్, డాక్టర్ కృష్ణవేణి పాల్గొని అల్మాస్గూడ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన 300 వందల మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన మెడిసిన్స్ అందించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ సభ్యులు రమేష్, శ్రీకాంత్, రామారావు, గణేష్, సురేష్ పాల్గొని ఉచిత వైద్య పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నర్స్ లు, ఇతర వైద్య సిబ్బంది స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.