Search for:
  • Home/
  • क्षेत्र/
  • అన్నోజిగూడలో ఘనంగా ప్రారంభమైన సంస్కృతి మల్టీ కుజైన్ రెస్టారెంట్

అన్నోజిగూడలో ఘనంగా ప్రారంభమైన సంస్కృతి మల్టీ కుజైన్ రెస్టారెంట్

మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా: జులై 11(భారత్ కి బాత్)

 

మేడ్చల్- మల్కాజ్గిరి నియోజకవర్గం పోచారం నుండి ఘట్కేసర్ వెళ్లే దారిలో అన్నోజిగూడలో నారాయణ జూనియర్ కళాశాల ప్రక్కన విడిఆర్ రెసిడెన్సి మొదటి అంతస్తులో గురువారం నాడు రాఘవేందర్, వంశీకృష్ణ రెడ్డి, కార్తీక్, ప్రవీణ్ ల సంయుక్త నేతృత్వంలో సంస్కృతి మల్టీ కుజైన్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాన్యం వారు మాట్లాడుతూ హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే రహదారిపై పరిసర ప్రాంత వాసులకు, ప్రజలకు కుటుంబ సమేతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్, సౌత్, నార్త్ ఇండియన్ ఫుడ్, బిర్యానీ, ప్రాన్స్, పులావ్, సూప్స్, సలాడ్స్, సౌత్ ఇండియన్ స్టార్టర్స్ లు ఉన్నాయని, స్విగ్గి, జొమాటో సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నాణ్యతలో, రుచిలో ఎక్కడ రాజీపడకుండా వినియోగదారులకు మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా తమ వద్ద అన్ని రకాల పార్టీలకు సంబంధించిన బ్యాంకట్ హాల్, లగ్జరీ రూమ్స్ ఉన్నాయన్నారు. ఇతర వివరాల కొరకు యాజమాన్యం వారిని సంప్రదించాల్సిన నెంబర్ 9849926878.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required