ఆటోనగర్లో అధ్యక్షులు ఆంజనేయులు ఆధ్వర్యంలో 138వ మేడే ఉత్సవాలు
ఎల్. బి. నగర్: మే 2(భారత్ కి బాత్)
మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ కార్మికులకు హామీ ఇచ్చారు. బుధవారం నాడు మే డే సందర్భంగా ఆటోనగర్ లోని గంగా జమున హోటల్ వద్ద హైదరాబాద్ ఆటోనగర్ మెకానిక్ అసోసియేషన్, సిఐటియు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మే డే జెండాను ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆటోనగర్ మెకానిక్ అసోసి యేషన్ అధ్యక్షులు నందగిరి ఆంజనేయులు గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్యాల జైపాల్ రెడ్డి, కోశాధికారి కొసిరెడ్డి చల్మారెడ్డి, కార్యవర్గ సభ్యులు కుమార్ యాదవ్, సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కీసరి నర్సిరెడ్డి, హైదరాబాదు లారీ సప్లయర్స్, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూరెళ్ల వేములయ్య గౌడ్, మధుయాష్కి గౌడ్ అభిమాన సంఘం అధ్యక్షులు బత్తుల మల్లేషం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.