మేడిగడ్డ తండాలో యువతి వివాహానికి బియ్యం అందజేత
రంగారెడ్డి: ఏప్రిల్ 27(భారత్ కి బాత్)
ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామ పంచాయతీలో నిరుపేద కుటుంబానికి చెందిన సభావట్ వాలి-అంజ్యా నాయక్ ల పుత్రిక శిరీష వివాహానికి మేడిగడ్డ తండా గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 100 కేజీల బియ్యాన్ని మేడిగడ్డ తండా కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు విజయ్ రాథోడ్ చేతుల మీదుగా బియ్యాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ రాథోడ్ మాట్లాడుతూ మేడిగడ్డ తండాలో ఇప్పటి సుమారు 44 మంది కుటుంబాలకు తండా మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్ వారి వంతు సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం మల్లేష్ నాయక్ కు వారి కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, రవీందర్, బిచ్య, కవిత, రజిత, అరుణ, సువాలి తదితరులు పాల్గొన్నారు.