మన్ సాని పల్లి చౌరస్తాలో నూతనంగా ప్రారంభమైన విజయ చంద్ర హాస్పిటల్
రంగారెడ్డి: ఏప్రిల్ 27(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గంలోని మన్ సాని పల్లి X రోడ్ లో కాల్వకోల్ గ్రామ ఉపసర్పంచ్ బొజ్జం చoద్రయ్య యాదవ్ కుమారుడు డా. బొజ్జం ప్రవీణ్, డా. స్రవంతి దంపతులు నిర్మించిన విజయ్ చంద్ర హాస్పిటల్ ను ప్రారంభించిన బిజెపి మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్. అనంతరం శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరికీ నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని యజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఎంపీపీ కొండే వెంకటేష్, అమీర్పేట్ సర్పంచ్ శ్రీశైలం గౌడ్, చంద్రయ్య గౌడ్, పెండ్యాల యాదయ్య గౌడ్, శేఖర్ గౌడ్, జైపాల్ రెడ్డి, నందీశ్వర్, రాజు యాదవ్, శివా యాదవ్, భరత్ రెడ్డి, హాస్పిటల్ యాజమాన్యం, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.