అంగరంగ వైభవంగా గుండాల అనుబంధ గ్రామం లక్ష్మీ గూడెం లో శ్రీ రాముని కళ్యాణం
అంగరంగ వైభవంగా గుండాల అనుబంధ గ్రామం లక్ష్మీ గూడెం లో శ్రీ రాముని కళ్యాణం
రంగారెడ్డి: భారత్ కి బాత్ న్యూస్ 17-04-2024
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పరిధి లో గుండాల అనుబంధ గ్రామం లక్ష్మీగూడెం లో శ్రీ రాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ శ్రీ రాముల వారి కల్యాణం చూడడానికి పెద్ద మొత్తం లో భక్తులు వచ్చారు. ఆ గ్రామం శ్రీ రామ నామం తో మారుమోగింది. తరువాత భక్తులు తీర్థ , ప్రసాదాలు తీసుకున్నారు. అలాగే ఊరేగింపు మరియు భజన కార్యక్రమం కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమం శ్రీ శ్రీరామ్ రెడ్డి , నాగమణి దంపతుల వారి ఆధ్వర్యంలో మరియు గ్రామ వేద పండితుడు శ్రీ రాఘవేందర్ గారి వేదమంత్రాలతో ఘనంగా జరిగింది. పలువురు గ్రామ పెద్దలు కూడా హాజరు అయినారు.
శ్రీరామ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను అని అన్నారు. అలాగే ఆ భగవంతుని కృప నాపై ఎల్లవేళలా ఉండాలని మరియు గ్రామ ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు. హాజరైన భక్తులందరూ ఆ శ్రీ రాముల వారి కృప కు పాత్రులైనారు.