నంది హిల్స్ లో బిజెపి 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన ద్యాసని తిరుపతి రెడ్డి
రంగారెడ్డి: ఏప్రిల్ 6(భారత్ కి బాత్)
శనివారం నాడు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల నంది హిల్స్ కాలనీ చౌరస్తాలో ద్యాసని తిరుపతి రెడ్డి (కార్పొరేటర్ పోటీదారులు) ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుపతి రెడ్డి, బిజెపి నాయకులు అటల్ బిహారీ వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ద్యాసని తిరుపతి రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా వాజ్ పేయి, ఎల్ కే అద్వానీ, పార్టీ పెద్దలను గుర్తు చేసుకుంటూ, ఈరోజు వారి వల్లే భారత దేశం ఈ 10 ఏళ్లలోనే మోదీ హయాంలో ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూడా బిజెపి పార్టీ 400 కి పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ దళిత మోర్చా అధ్యక్షులు జెడి కుమార్, కృష్ణ, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు కాశీరాం యాదవ్, గోపీనాథ్, భారతీయ జనతా యువమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు రవీందర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సూరెడ్డి నరసింహారెడ్డి, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కార్యదర్శులు కేశవరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పాండురంగా రెడ్డి, రఘునాథ్ రెడ్డి, సతీష్ గౌడ్, ఇంద్రసేనా రెడ్డి, రఘుమా రెడ్డి, కృష్ణారెడ్డి, రాజశేఖర్, రంజిత్ నాయక్, మనోహర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.