Search for:
  • Home/
  • क्षेत्र/
  • ఆటోనగర్లో గ్రేట్ బాంబే సర్కస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఆటోనగర్లో గ్రేట్ బాంబే సర్కస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

హైదరాబాద్: మార్చి 30(భారత్ కి బాత్)

 

హైదరాబాద్ వనస్థలిపురం ఆటో నగర్ లో జింకల పార్క్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటుచేసిన బాంబే సర్కస్ ను శుక్రవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. 25 రోజులపాటు కొనసాగే ఈ సర్కస్ లో అనేక రకాల విన్యాసాలతో పాటు శునకాలతో విన్యాసాలు కూడా ఉంటాయన్నారు. మిగతా సర్కస్లకు భిన్నంగా చైనా, రష్యా, ఇథియోపియా కళాకారులచే భయంకరమైన, ఒళ్ళు గగ్గోరు పొడిచే విన్యాసాలతో ప్రేక్షకులను అలరించనున్నట్లు నిర్వాహకులు సంజీవ్ వెల్లడించారు. 1500 మంది వీక్షించే సర్కస్ లో ప్రేక్షకుల భద్రతకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. అగ్ని, జల, వాయు నిరోధక గుడారాలను వినియోగిస్తూ సురక్షిత, సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించనున్నట్లు తెలిపారు. టికెట్లు బుకింగ్ సదుపాయం కూడా ఉందన్నారు. 8886033773/74/75/76 నెంబర్లలో బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్.ఓ. సంపత్ కూడా పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required