Search for:
  • Home/
  • क्षेत्र/
  • ఘనంగా ప్రారంభమైన బెల్మoట్ ది నెక్స్ట్ జెన్ స్కూల్

ఘనంగా ప్రారంభమైన బెల్మoట్ ది నెక్స్ట్ జెన్ స్కూల్

రంగారెడ్డి: మార్చి 19(భారత్ కి బాత్)

 

పిల్లల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి విద్యాసంస్థలు కృషి చేయాలని బడంగ్పేట్ మున్సిపల్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి సూచించారు. ఆదివారం బెల్మంట్ ది నెక్స్ట్ జెన్ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బడంగ్‌పేట మున్సిపల్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ విక్రం రెడ్డి, కార్పొరేటర్ రజిని, నాయకులు చల్లా నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డితో కలిసి జ్యోతి వెలిగించి వేడుకను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విద్యార్థులకు బాల్యం నుంచే విలువలతో కూడిన విద్యనందించాలని సూచించారు. అకాడమిక్ అడ్వైజర్ చంద్రమోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ అన్ని రంగాల్లో తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీదేవి వెంకటరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వైష్ణవి ఇంద్రారెడ్డి, రెస్పాండెంట్ రామ్ రెడ్డి, ఉపాధ్యాయులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required