విద్యార్థుల రాజకీయ పార్టీలో భారీగా చేరిన కార్యకర్తలు
హైదరాబాద్: ఫిబ్రవరి 18(భారత్ కి బాత్)
విద్యార్థుల రాజకీయ పార్టీలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నర్రా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఉప్పల్ నియోజికవర్గం నుండి కార్యకర్తలు భారీగా పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు యేచు సునీల్ మాట్లాడుతూ పార్టీలో సభ్యులుగా చేరినందుకు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా పార్టీలో చేరిన వారికి విద్యార్థుల రాజకీయ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇజ్జగిరి కమలాకర్, కోసిగే అనికేత్, పాక నవీన్ బాబు, గోగికర్ అనిల్ అందరిని సాదరంగ ఆహ్వానించారు.