పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి తరతరాలకు గుర్తుండిపోతుంది: సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి: జనవరి 27(భారత్ కి బాత్)
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా సత్పలితాలు సాధించామని, అందుకు ఎంపీటీసీలు, సర్పంచ్లు, పాలకవర్గాల అధికారుల కృషి ఎంతో అభినందనీయమని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. శనివారం నాడు మహేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా సకల సౌకర్యాలు కల్పించబడ్డాయని, స్వచ్ఛ గ్రామాలుగా మారాయన్నారు. నర్సరీలు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, ట్రాలీలు, ట్యాంకర్ లు, క్లస్టర్ కు ఒక రైతు వేదిక, రైతు కల్లాలు మీ హయాంలో ఏర్పాటు చేయటం ఎంతో గొప్ప విషయమని, చరిత్ర పుటల్లో నిలిచిపోతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు, జల్పల్లి సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ అజ్జు తదితరులు పాల్గొన్నారు.