ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైదరాబాద్: జనవరి 28(భారత్ కి బాత్)
ఆదివారం నాడు హైదరాబాద్, కర్మన్ ఘాట్ లోని శ్రీలక్ష్మి కన్వెన్షన్ హల్ లో బ్రహ్మర్షి రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం కోసం జరుగుతున్న యజ్ఞంలో శ్రీ సర్వ సౌభాగ్య దేవిత్రయ గీతా జ్ఞాన యజ్ఞం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ మరియు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఐవిఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ లోక కల్యాణార్థం కోసం, ప్రపంచ శాంతి కోసం కాశీ విశ్వనాథ స్వామి వారి దివ్య సన్నిధి కాశీ క్షేత్రం నుండి తీయబడిన ప్రత్యేక వన మూలికల చేత ప్రత్యేక యజ్ఞము నిర్బహిస్తున్న, లక్ష్మీ కన్వెన్షన్ యాజమాన్యం శ్రీను, సురేష్, బాలరాజుల ఆధ్వర్యంలో బ్రహ్మర్షి రాజేశ్వర శర్మ నేతృత్వంలో శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్ లో మూడు రోజులుగా చేస్తున్న యజ్ఞంలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. లోక కల్యాణార్థం, ప్రపంచ శాంతి కోసం చేస్తున్న ఈ యజ్ఞం వలన ప్రజలంతా బాగుండాలని, అందులో మనముండాలని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ సాయి నాధుడిని, వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో సూరిశెట్టి శ్రీనివాస్ గుప్త, సూరిశెట్టి సురేష్ గుప్త, సూరిశెట్టి బాలరాజు గుప్త, ఆర్యవైశ్య నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.