ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు: తెలంగాణ ఆరెకటిక సంఘం
రంగారెడ్డి: జనవరి 29(భారత్ కి బాత్)
త్వరలో రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారి చేశారని, కావున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరెకటిక కుల బంధువులందరూ మన ఇంటికి వచ్చే అధికారులకు మన కులం పేరు ఆరెకటిక అని చెప్పవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు జి. సురేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. జహంగీర్, ఇబ్రహీంపట్నం సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోకల్ కార్ జి. హరి నారాయణ కోరారు.