Search for:
  • Home/
  • क्षेत्र/
  • శివ మాలధారణ స్వాములకు సన్నిధానం షెడ్డు నిర్మించిన కాంగ్రెస్ యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి

శివ మాలధారణ స్వాములకు సన్నిధానం షెడ్డు నిర్మించిన కాంగ్రెస్ యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి

రంగారెడ్డి: జనవరి 25(భారత్ కి బాత్)

 

ఎల్ బి నగర్ లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శివ శక్తి సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా శివ స్వాములు మాలధారణ ధరించి ఎల్ బి నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఉంటున్నారు, కానీ వారికి ఉండడానికి అనువైన సన్నిధానం లేదనే విషయం తెలుకున్న కాంగ్రెస్ యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, శివ స్వాములకు సన్నిధానానికి షెడ్డు నిర్మాణం, ఫ్లోరింగ్ కూడా సిద్ధం చేసి, స్వాములు పూజలు చేసుకొని ఉండడానికి అనుకూలంగా చేయించారు. ఈ సందర్భంగా రేపు మాలధారణ కోసం శ్రీ శ్రీశైల భ్రమరాంబిక క్షేత్రానికి వెళ్ళే ముందు శివ శక్తి సేవా సమితి నిత్య అన్నదాన సేవ సమితి అధ్యక్షుడు గురు స్వామి కాటం రాజుతో పాటు వారి బృంద సభ్యులందరూ కలిసి చిలుక ఉపేందర్ రెడ్డికి కృత్ఞతలు తెలియజేశామని శివ శక్తి సేవా సమితి వారు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో రాజేష్ కుమార్, వెంకటేష్, జగదీశ్, బాలకృష్ణ, కుమార స్వామి, మల్లేష్, సంజయ్, సైదులు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required