అల్మాస్ గూడలో సిత్ల, బోనాల పండుగలో పాల్గొన్న చిగిరింత పారిజాత నరసింహారెడ్డి
రంగారెడ్డి: జులై 14(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని అల్మాస్ గూడ తిరుమల నగర్ కాలనీలో బంజారా సంఘం అధ్యక్షులు ధన్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి దేవాలయం వద్ద జరిగిన సిత్ల, బోనాల పండుగలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. ఈ సందర్భంగా చిగురింత పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ పోచమ్మ తల్లి దయవల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని కోరానన్నారు. ఈ సందర్భంగా ధన్ సింగ్ నాయక్ మాట్లాడుతూ పండుగ అనేది ప్రతి ఒక్కరు కలిసి మెలిసి జరుపుకునేదని, పోచమ్మ తల్లి దయ వల్ల అందరు బాగుండాలని, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, అల్మస్ గూడ 24వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగు రామిరెడ్డి, ప్రెసిడెంట్ జై ధన్సింగ్ నాయక్, జనరల్ సెక్రెటరీ ఏ. మోహన్ నాయక్, కోశాధికారి జె. రాంచందర్ నాయక్, గౌరవనీయులైన అధ్యక్షులు వి. లాలూ నాయక్, అడ్వైజర్స్ నరసింహ నాయక్, అమిన్ సింగ్ నాయక్, గణేష్ నాయక్, లక్ష్మణ్ నాయక్, రాంచందర్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ రంజా నాయక్, శంకర్ నాయక్, రవీందర్ నాయక్, మహేష్ నాయక్, జాయింట్ సెక్రటరీ రాజు నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వీరులాల్ నాయక్, బాలాజీ నాయక్, రమేష్ నాయక్, వెంకట్ రామ్ నాయక్, శంకర్ నాయక్, రేవ్ సింగ్ నాయక్, రవి నాయక్, తారాచంద్ నాయక్, సభ్యులు సక్రు నాయక్, హనుమంతు నాయక్, దశరథ్ నాయక్, భరత్ నాయక్, స్వతంత్ర కుమార్ నాయక్, సంజు నాయక్, గణేష్ నాయక్, రవి నాయక్, బాషా నాయక్, సీతారామ్ నాయక్, మోతిలాల్ నాయక్, అశోక్ నాయక్, మహేందర్ నాయక్, రవి నాయక్, ఇతర సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది.