పెర్ల్ బేకర్స్ & ఫాస్ట్ ఫుడ్ ప్రారంభోత్సవం
ఎల్బీనగర్: జులై 7(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం నుండి సాహెబ్ నగర్ వెళ్లేదారిలో పెర్ల్ బేకర్స్ & ఫాస్ట్ ఫుడ్ సుష్మిత, నాగరాజు నేతృత్వంలో ఘనంగా ప్రారంభించారు. నూతన వ్యాపార ప్రారంభోత్సవం సందర్భంగా బేకరీ యజమాని మాట్లాడుతూ వనస్థలిపురం వినియోగదారులకు ప్రశాంతమైన వాతావరణంలో మంచి హై క్వాలిటీ ఫుడ్ అందించాలనే తపనతో వనస్థలిపురం సాహెబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించినట్లు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన, రుచికరమైన అనేక రకాలైన బేకరీ ఐటమ్స్ కేక్స్, చీస్ కేక్స్, మిల్క్ షేక్స్, పేస్ట్రీస్, కూల్ డ్రింక్స్, పప్స్, ఫాస్ట్ ఫుడ్ తో పాటు అనేక రకాల సరికొత్త రుచులను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, బంధుమిత్రులు హాజరై తమ అభినందనలు తెలియజేశారు.