గిరిజన గర్జన సభాస్థలిని పరిశీలించిన జడ్పిటిసిలు దశరథ్ నాయక్, అనురాధ పత్య నాయక్
రంగారెడ్డి: మే 2(భారత్ కి బాత్)
గురువారం ఆమనగల్ మండల కేంద్రంలో జరగబోయే గిరిజన గర్జన సభా స్థలాన్ని గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్, స్థానిక జెడ్పిటిసి అనురాధ పత్యానాయక్ తో పాటు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రతి పల్లె, పల్లె తండా, తండాల నుంచి గిరిజనులు భారీ సంఖ్యలో తరలివచ్చి గిరిజన గర్జన సభను విజయవంతం చేయాలని కోరారు. మండల నలుమూలల నుంచి వచ్చే గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నాయకులను కోరారు.