Search for:
  • Home/
  • क्षेत्र/
  • ఆటోనగర్ లో అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో 138వ మేడే ఉత్సవాలు

ఆటోనగర్ లో అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో 138వ మేడే ఉత్సవాలు

రంగారెడ్డి: మే 2(భారత్ కి బాత్)

 

మేడే స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యమాలను రూపకల్పన చేసుకోవాలి. సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి 138వ మే డే ఉత్సవాలను హయత్ నగర్ మండల సమితి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అధ్యక్షులు గోల్కొండ నాగరాజు సారధ్యంలో ఆటోనగర్ ఇసుక లోడింగ్ అన్లోడింగ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎ.ఐ.టి.యు.సి జేండాను ఆవిష్కరించిన సి.పి.ఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రా చారి. ఎ.ఐ.టి.యు.సి రంగారెడ్డి జిల్లా సబ్ కమిటీ సభ్యులు సామిడి శేఖర్ రెడ్డి వారిరువురూ మాట్లాడుతూ నన్ను ఉరి తీయబడినంత మాత్రాన ఈ పోరాటం అగ్నిజ్వాల అంతరించదని, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటూ మార్క్ ఇచ్చిన నినాదాన్ని ఉరి కంభం ఎక్కిన కార్మిక నాయకుడు ఆగస్టు స్పైస్ మన మరణం పీడిత తాడిత జన శంఖారావమై విశ్వవ్యాప్తంగా మార్మోగింది. పోరాడితే పోయేదేది లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న కారల్ మార్క్ పోరు నినాదం శ్రామికుల్లో చైతన్యాన్ని రగిలించింది. 16 గంటల పని చేయలేమని ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పాలకవర్గాల మెడలు వంచేలా శ్రమ దోపిడి, బానిసత్వం, వెట్టి చాకిరి నుండి విముక్తి చేసిందని, ఇది మేడే నే కాకుండా, చికాగో నగరంలో అమరులైన వారి సంస్మరణ దినంగా మే ఒకటి ప్రపంచ చరిత్రలోకి ఎక్కింది. 1886 మే 1న చికాగో నగరంలో లక్షలాదిమంది కార్మికులు 8 గంటల పని దినాల కోసం సమ్మె చేశారు. మే 3 న శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న కార్మికులపై పోలీసులు కాల్పులు జరిపితే, ఆరుగురు మరణించారు. ఈ దారుణాన్ని నిరసిస్తూ మే 4న చికాగో నగరంలో పెద్ద సభను నిర్వహించారు. ప్రశాంతంగా జరుగుతున్న సభపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమై కార్మికుల ఆహాకారాలతో దద్దరిల్లింది. ఒక పోలీస్ సార్జెట్ ను హత్య చేశారనే అభియోగంతో కార్మిక నాయకులైన ఆగస్టు స్పైస్, ఆల్బర్ట్ పార్సన్స్, అడల్స్ పిషర్, జార్జ్ ఎంగిల్ లను ఆనాటి పాలకవర్గం ఉరితీసిందని 1920లో మన భారతదేశంలో ఏఐటియుసి ఆవిర్భవించింది. దేశ స్వాతంత్ర్యంతో పాటు కార్మికుల శ్రమ దోపిడీ బానిసత్వం నుండి విముక్తి చేయడానికి సమాన పనికి సమాన వేతనం కోసం నినదించి కార్మికుల హక్కులకై నిర్విరామ పోరాటాల ద్వారా సాధించుకున్న 40 చట్టాలను నేటి పాలన చేస్తున్న బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ చర్చలకు అనుకూలంగా చట్టాలను 4 కోడ్ లుగా చేసి కార్మికులను తిరిగి బానిసత్వం వైపు నెట్టే ప్రయత్నాలను మానుకోకపోతే కార్మికుల నినాదంతో కొట్టుకోవడం తథ్యం అన్నారు. భారత రాజ్యాంగం అందించిన హక్కులను గత 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ సర్కారు తుంగలో తొక్కి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మిక, కర్షక యువజన ఉద్యోగ విద్యార్థులను మోసం చేస్తుందని లౌకిక ప్రజాస్వామ్య దేశాన్ని మనుధర్మం, సనాతనం పేరుతో మత ఉద్దేశాలను రెచ్చగొడుతూ సౌబ్రాతృత్వానికి విఘాతం కల్పిస్తున్నారు. అందుకే యావత్తు కార్మిక లోకం మేల్కొని 2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించడం ద్వారా కార్మిక చట్టాలతో పాటు ఈ దేశంలో ఉన్న భిన్న మతాలు, కులాలు, భాషలు, భిన్నమైన ఆచార వ్యవహారాలు కలిగిన లౌకిక ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే ప్రభుత్వాన్ని యావత్తు భారతీయులు ఓటు అనే వజ్రాయుధంతో ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎ.ఐ.టి.యు.సి మండల కార్యదర్శి రమావత్ సక్రు నాయక్ ఎ.ఐ.వై.ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పోలోజు, లక్షణాచారి ఎ.ఐ.యస్.ఎఫ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సామిడి, వంశీ వర్ధన్ రెడ్డి, మండల సహాయ కార్యదర్శి శ్రీదేవి, ఇసుక లోడింగ్ అన్లోడింగ్ సంఘం కార్యదర్శి సురేందర్ మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు సుజాత, సరిత, ఆటో ట్రాలీ యూనియన్ అధ్యక్షులు బిచుపల్లి, శంకర్, బి.ఒ.సి. నాయకులు, జాని, వెంకట్, చంది వెంకట్, యువజన సంఘం నాయకులు శోభన్, యనమల్ల శ్రీకాంత్, ముత్తయ్య, రాములు, సోషల్ మిడియా వారియర్స్ మమతతో పాటు ప్రజాసంఘాల నాయకులు, కార్మిక శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required