కల్వకుర్తి నుండి 200 మంది బీసీలు ధర్నా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరిన జాంగిర్ జి మరియు సంపంగి శ్రీశైలం
కల్వకుర్తి నుండి 200 మంది బీసీలు ధర్నా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరిన జాంగిర్ జి మరియు సంపంగి శ్రీశైలం
హైదరాబాద్: డిసెంబర్ 31(భారత్ కి బాత్)
తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జి మరియు రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ ఉపాధ్యక్షులు సంపంగి శ్రీశైలం ల ఆధ్వర్యంలో మంగళవారం నాడు నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో జాంగిర్ జి మరియు సంపంగి శ్రీశైలంలు మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో ఇంద్రాపార్క్ లో జనవరి 3వ తేదీ నాడు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 70 బీసీ కులాల ఆధ్వర్యంలో నిర్వహించబోయే ధర్నా కార్యక్రమానికి కల్వకుర్తి నియోజకవర్గంలోని బీసీలందరూ పాల్గొని, జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాయకత్వాన్ని బలపరచవలసిందిగా కోరుతున్నామని, అలాగే కల్వకుర్తి నియోజకవర్గం నుంచి రెండు బస్సులు అందుబాటులో ఉంటాయని, 200 మంది బీసీ కుల బంధువులు పాల్గొని, సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు. బీసీల ఐక్యతను బలపరుద్దామని, బీసీల బలాన్ని చాటి చెబుతామని అన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జి మరియు రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ ఉపాధ్యక్షులు సంపంగి శ్రీశైలం, బిఆర్ఎస్ నాయకులు కళ్యాణ్ కార్ శంకర్ జి, కటికల శేఖర్ యాదవ్, గ్రామ అధ్యక్షులు మోక్తాల జంగయ్య గౌడ్, మాజీ ఉపసర్పంచ్ సొల్లు సుధాకర్, హోటల్ నరసింహ యాదవ్, కే. ప్రసాద్, శివ, నరేష్, రమేష్, హరికృష్ణ, గంజి సీనయ్య, రాఘవా చారి, కటికల మల్లేష్, రాములు, కడిగేం యాదయ్య, సొల్లు యాదగిరి, శ్రీకాంత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.