Search for:
  • Home/
  • क्षेत्र/
  • దేశం కోసం, ధర్మం కోసం బిజెపిని గెలిపించాల్సిందే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

దేశం కోసం, ధర్మం కోసం బిజెపిని గెలిపించాల్సిందే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మహేశ్వరం నియోజకవర్గంలో భారీ మెజారిటీని ఇవ్వబోతున్నాం: అందెల శ్రీరాములు

 

రంగారెడ్డి: మార్చ్ 7(భారత్ కి బాత్)

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో నరేంద్ర మోడీకి చేవెళ్ల పార్లమెంట్ సీటును కానుకగా ఇవ్వాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు మాట్లాడుతూ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు పని చేశారో అంతకు రెట్టింపు ఉత్సాహంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కృషి చేయాలని, అంతేకాకుండా కేంద్రం చేపట్టిన అనేక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి గ్రామంలో ప్రతి బూత్ లో ప్రతీ కార్యకర్త ప్రజలతో మమేకమై పని చేయవలసిందిగా కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, సీనియర్ నాయకులు కొలను శంకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా నాయకులు, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required