Search for:
  • Home/
  • क्षेत्र/
  • బాలాపూర్ మండల ఎలక్ట్రికల్ అండ్ టెక్నికల్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు: సల్వా చారి

బాలాపూర్ మండల ఎలక్ట్రికల్ అండ్ టెక్నికల్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు: సల్వా చారి

రంగారెడ్డి: జనవరి 21(భారత్ కి బాత్)

 

రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాలాపూర్ మండల ఎలక్ట్రికల్ అండ్ టెక్నికల్ అసోసియేషన్ నూతన కమిటీ ఆదివారం నాడు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు నెల్లోజు సల్వా చారి అధ్యక్షతన కమిటీకి ప్రమాణ స్వీకారం చేయిస్తూ, నూతనంగా ఎన్నుకోబడినటువంటి నిరంజన్ ఉపాధ్యక్షులు, వెంకటేష్ గౌరవ అధ్యక్షులుగా, వెలుగు వెంకటేష్ ప్రధాన కార్యదర్శిగా, గిరి, కాశీ నాయుడు, గణేష్ తదితరులను ఎన్నుకోవడం జరిగిందని సల్వా చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ అసోసియేషన్ నక్క యాదగిరి, నియమాల బెనర్జీ, రఘు, మల్లేష్, సోషల్ మీడియా భాస్కర్, పాషా వివిధ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు పాల్గొనడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం అశోక్ ఫంక్షన్ హాల్ టీ కే ఆర్ కమాన్ ఎదురుగా నిర్వహించి, సంఘంలోని పెద్దలు కార్మికుల సమస్యలపైన ఎలక్ట్రికల్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడడం జరిగిందని సల్వా చారి అన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required