కల్వకుర్తిలో వీపీఎల్ 10 (వెల్జాల్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నమెంట్
కల్వకుర్తి: జనవరి 16(భారత్ కి బాత్)
కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో వీపీఎల్ (వెల్జాల్ ప్రీమియర్ లీగ్) 10 వ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సిఎల్ శ్రీనివాస్ యాదవ్. మ్యాచ్ విన్నర్స్ కి మొదటి బహుమతి 10,000 (పదివేల రూపాయలు) అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వెల్జాల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, స్నేహ బంధాలు ఏర్పడతాయని అన్నారు. క్రీడాకారులు అడిగిన విధంగా వాళ్ళ కోరిక మేరకు వచ్చే సంవత్సరం వరకు క్రికెట్ గ్రౌండ్ లెవలింగ్ పూర్తి చేసి, చుట్టూ ట్రాక్ లైన్ ఏర్పాటు చేస్తానని క్రీడాకారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ అబ్బాస్, జిల్లా కో ఆప్షన్ బుజ్జు బర్ రెహమాన్, పి ఎ సి ఎస్ వైస్ చైర్మన్ కున రవి, ఉప్ప సర్పంచ్ అజిజ్, ఎంపీటీసీ అంబాజి, ప్రకాష్, శ్రీనివాస్, రిపోర్టర్ విష్ణువర్ధన్, వానరసి వెంకటేష్, సాయికుమార్, అవినాష్, గోపాల్ కృష్ణ, ఖయ్యుమ్, వార్డు సభ్యులు విజయ్ కుమార్, శ్రీరామ్, యాదయ్య, పెంటయ్య గౌడ్, నాయకులు, అరిఫ్, సుధాకర్, రాఘవేందర్, విజయ్, శేఖర్, శ్రీను, రషీద్, శ్రీశైలం, రాము, లింగం, కృష్ణ, సుల్తాన్, క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.