మాజీ సర్పంచ్ గోళి కమలమ్మతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి
కల్వకుర్తి: జనవరి 16(భారత్ కి బాత్)
కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు ముందస్తుగా కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామపంచాయతీలో తాండ్ర మాజీ సర్పంచ్ గోళి కమలమ్మ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేతో కలిసి కేక్ కట్టింగ్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్, కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్, మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, సురేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి,రామకాంత్, సన్వాజ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.