Search for:
  • Home/
  • क्षेत्र/
  • ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి- పద్మ అనిల్ ముదిరాజ్

ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి- పద్మ అనిల్ ముదిరాజ్

రంగారెడ్డి: జనవరి 8(భారత్ కి బాత్)

 

తలకొండపల్లి మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ లేక మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తలకొండపల్లి ఉప సర్పంచ్, బిజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్ అని అన్నారు. పిల్లలకు నూతన ఆధార్ కార్డులు తీయాలన్న, పేరు, అడ్రస్, మార్చాలన్న, ప్రస్తుతం అందరి ఆధార్ కార్డులో అడ్రస్ జిల్లా మహబూబ్ నగర్, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఉంది, వాటిని అప్డేట్ చేయించాలన్న వెల్దండ, కల్వకుర్తి, ఊరుకొండ పేట, మిడ్జిల్

మండలాలకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. అక్కడ ఆధార్ సెంటర్ల దగ్గర జనాలు ఎక్కువ మంది ఉండటంతో రెండు లేదా మూడు సార్లు వెళ్ళవలసి వస్తుందని, కావున మండల ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధికారులు ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేయవలసిందిగా తలకొండపల్లి తహసిల్దార్ కార్యాలయంలో డి.టి. కి వినతి పత్రం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పద్మ అనిల్ ముదిరాజ్ ఉప సర్పంచ్ తలకొండపల్లి, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్-కల్వకుర్తి, వెంకటేష్, నాయిని కుమార్, మధు, రాజా శేఖర్, ఆనంద్, పరమేష్ పాల్గొన్నారు.

 

Leave A Comment

All fields marked with an asterisk (*) are required