ఆరెకటిక కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలి: తెలంగాణ ఆరెకటిక ప్రజలు
రంగారెడ్డి: జనవరి 8(భారత్ కి బాత్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరెకటిక కార్పొరేషన్ చైర్మన్ పదవిని తెలంగాణ ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జికి ఇవ్వాలని, ఆరెకటికల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న యువకుడు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు ఉన్న నాయకులు, ఆరెకటిక సమస్యల గురించి గత ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లడం జరిగిందని, ఆరె కటికలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానని భరోసానిస్తూ మన ఆరెకటిక సమస్యలు నేరవేర్చదాక పోరాటాన్ని ఆపనని పోరాటాలు చేసుకుని ముందుకు పోతూ, ఆరెకటిక సమస్యలపై రాష్ట్రస్థాయిలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, ఆరెకటికలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నాణ్యమైన డిమాండ్లు నెరవేర్చాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెంటనే రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జికి ఆరెకటిక కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలని తెలంగాణ ఆరెకటిక ప్రజలు నమస్కరించి ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
1 Comment
అలజడి రేగిన హృదయంలో
కలతల మబ్బుల కదనంలో
నీడల జాడలు పోగొడుతూ
తూరుపు తలుపు తీసింది
తలపుల తీగలు తెంపేస్తూ
వగపుల వ్యధలు మరిపిస్తూ
వరుసగ కిరణం ఝళిపిస్తూ
వెలుగుల వసుధను నింపేస్తూ..
వేగుచుక్క పొడిచాక
వెన్నెల తెల్లబోయేలా
వెచ్చగ సోకే స్పర్శలతో
వెల్లువగ పుడమిని పాకేస్తూ
నిశిని పరచిన నిరాశల
అడుగుజాడల అలికేస్తూ
అణువణువూ ఆశలు చిమ్ముతూ
ఉషను ఉర్విపై స్వారీ చేయిస్తూ
అలుపెరుగని యాత్రికుని
పిలుపులకు చేయందిస్తూ
కలుపులన్నీ తొలగిస్తూ
గెలుపు దిశగా అడుగేయిస్తూ
రంగుల కొంగులు పరచిన
నింగిని చూసి పొంగిపోయి
జిలుగుల బహుమతినిస్తూ
నలుదిశలకు కృపనందిస్తూ
ఆగమించు ఆదిత్యునికి
🌸🌸 సుప్రభాతం🌸🌸🙏