ప్రజల సొమ్మును తిరిగి అందజేయాలి: తల్లోజు ఆచారి
కల్వకుర్తి: జనవరి 8(భారత్ కి బాత్)
కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర, కుప్పగండ్ల, తిమ్మనోనిపల్లి, నారాయణ పూర్ తదితర గ్రామాలలో రాత్రి సమయాలలో తాళాలు వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకొని దొంగలు పడి ప్రజల సొమ్మును దోచుకోవడంతో, దొంగలను గుర్తించి ప్రజల సొత్తును తిరిగి అప్ప చెప్పాలని బిజెపి నేత మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి నియోజకవర్గ బిజెపి ప్రతినిధుల బృందంతో కలిసి కల్వకుర్తి పోలిస్ స్టేషన్ లో డిఎస్పి పార్థసారథిని కలిసి ప్రజల సొత్తు దొంగిలించిన దొంగలను వెంటనే పట్టుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తాలూకా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.