డ్రైనేజీ సమస్యలను త్వరగా పరిష్కరించాలి: కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి
రంగారెడ్డి: జనవరి 4(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్ స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి శనివారం నాడు వాటర్ వర్క్స్ కమిషనర్ అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా వనస్థలిపురం డివిజన్లో ఉన్న అన్నీ కాలనీలలో డ్రైనేజీలు పొర్లి పొంగుతున్నాయని, అలాగే కొత్తగా డ్రైనేజీలు సాంక్షన్ చేయాలని వాటర్ వర్క్స్ కమిషనర్ కి వివరించారు. కమిషనర్ కూడా డివిజన్ లోని సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని కార్పొరేటర్ తో అన్నారు.