అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: డిసెంబర్ 25(భారత్ కి బాత్)
గడ్డిఅన్నారం డివిజన్ అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్ నేతృత్వంలో నేతాజీ నగర్ చౌరస్తా వద్ద భారతరత్న, భారత మాజీ ప్రధాని, కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, జాతికి ఆయన చేసిన విశేష సేవలను గుర్తు చేశారు. భారతదేశం యొక్క అభివృద్ధి మరియు అభివృద్ధికి అటల్ జీ యొక్క విజన్ మనకు స్ఫూర్తినిస్తూనే ఉందని, సుపరిపాలన పట్ల ఆయనకున్న నిబద్ధత మనకు మార్గదర్శక సూత్రమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చిలుకూరి రామ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఆనంద్ కుమార్, లక్ష్మి దేవి, నగేష్, ఓంకార్, వెంకటేష్ చారి, కేశవ్ నాయక్, ఏనుగు శ్రీధర్ రెడ్డి, రాజేశ్వరి, శివ రామ్, సుజాత, వెంకట్ రెడ్డి, కృష్ణ, కిషోర్, సిరి రెడ్డి, భీష్మాచారి, శ్రీనివాస్ చారి, సత్య నారాయణ, టింకు, శశాంక్, రఘునందన్ జోషి తదితరులు పాల్గొన్నారు.