Search for:
  • Home/
  • क्षेत्र/
  • కొత్తపేట్ లో నూతనంగా ప్రారంభమైన స్నిచ్ మెన్స్ ఫ్యాషన్ వేర్

కొత్తపేట్ లో నూతనంగా ప్రారంభమైన స్నిచ్ మెన్స్ ఫ్యాషన్ వేర్

హైదరాబాద్: డిసెంబర్ 7(భారత్ కి బాత్)

కొత్తపేట్ లోని ఎన్టీఆర్ నగర్ వైట్ హౌస్ ఎదురుగా శనివారం నాడు స్నిచ్ ఫ్యాషన్ వేర్ స్టోర్ ను యాజమాన్యం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమాని రోహిత్ ఝంనాని మాట్లాడుతూ మా వద్ద ప్రత్యేకమైన, విశేషమైన ఫ్యాబ్రిక్ ఉపయోగిస్తామని, వినియోగదారుల సౌకర్యార్థం కోసం ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా 20% డిస్కౌంట్ ఇస్తున్నామని, వినియోగదారులు ఈ ఆఫర్ ను సద్వినియోగం పరుచుకోవాలని అన్నారు. పురుషుల బ్రాండ్ అయినా స్నిచ్ ఫ్యాషన్ వేర్ స్టోర్ భారతదేశంలో 34వ బ్రాంచ్, హైదరాబాదులో ఇది మూడవ బ్రాంచ్ అని పేర్కొన్నారు. స్నిచ్ ఫ్యాషన్ వేర్ దేశంలో అత్యధిక వినియోగదారుల ఆదరణ పొందిన బ్రాండ్ గా గుర్తిస్తున్నారని, మన్నికతో, సున్నితత్వంతో కూడిన దుస్తులు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. తమ కస్టమర్లు ఎల్లప్పుడూ అత్యంత స్టైలిష్ దుస్తులు ఎంపికలను కలిగి ఉంటారని, వారి అభిరుచులకు అనుగుణంగా గ్లోబల్ ఫ్యాషన్ ట్రెండ్లను, తమ కస్టమర్లకు అందించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్క వినియోగదారులు మా యొక్క స్టోర్ కి విచ్చేసి, తమ విలువైన అభిప్రాయాలను, సలహాలను తెలపాలని కోరారు. ఈ ప్రారంభోత్సవంలో క్లస్టర్ మేనేజర్స్ అంజన్ కుమార్, రూపేష్ కుమార్, స్టోర్ మేనేజర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required