బండ్లగూడలో నూతనంగా ప్రారంభమైన కె. భూపాల్ రెడ్డి ప్యూర్ గీ స్వీట్ హౌస్
రంగారెడ్డి: అక్టోబర్ 29(భారత్ కి బాత్)
నాగోల్ నుండి బండ్లగూడ వెళ్లే దారిలో ఆదివారం నాడు కె. భూపాల్ రెడ్డి ప్యూర్ గీ స్వీట్ హౌస్ రెండవ బ్రాంచ్ ను ముఖ్య అతిథిగా విచ్చేసి మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి. జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ దీపావళి సందర్భంగా స్వీట్ హౌస్ షాపును ప్రారంభించడం శుభదాయకమని, స్వీట్స్ చాలా రుచిగా ఉన్నాయని అన్నారు. నిలోఫర్ కేఫ్ యజమాని బాబు రావు మాట్లాడుతూ మా స్నాక్స్ కూడా కె. భూపాల్ రెడ్డి ప్యూర్గే స్వీట్ హౌస్ లో ఉన్నాయని, మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వారికి ఉంటాయని తెలిపారు.