ఆనంద్ నగర్ లో నూతనంగా ప్రారంభమైన ట్రూ హెల్త్ డయాగ్నస్టిక్స్ మరియు క్లినిక్
రంగారెడ్డి: ఆగష్టు 27(భారత్ కి బాత్)
ఉప్పల్ మండల్, ఆనంద్ నగర్ ఫతుల్లగూడాలో తాజా టిఫిన్ ఎదురుగా సోమవారం నాడు ట్రూ హెల్త్ డయాగ్నస్టిక్స్ మరియు క్లినిక్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, అరుణ సురేందర్ యాదవ్ లు హాజరయ్యారు. డైరెక్టర్, న్యూరో సర్జన్ డా. ఎమ్. జయవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మా వద్ద అత్యాధునికమైన టెక్నాలజీ, అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారని, పేద ప్రజలకు అతి తక్కువ ధరకే వైద్య సేవ అందిస్తామని తెలిపారు. ప్రజలందరూ మా వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు కె. శ్రీజ, తిమ్మారెడ్డి, టివిఆర్కె మూర్తి, కృష్ణారెడ్డి, అమీర్ భాష, జి. రామకృష్ణారెడ్డి, పి. విశ్వక్ సేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.