దళిత బిడ్డ పెళ్లికి చేయూతనిచ్చిన ఉప్పల ఫౌండేషన్
హైదరాబాద్: ఆగష్టు 22(భారత్ కి బాత్)
హైదరాబాద్ లోని నాగోల్ లో ఉప్పల శ్రీనివాస్ గుప్త క్యాంపు కార్యాలయంలో
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన (ఎస్సీ మాదిగ సామజిక వర్గం) మోటం గణేష్ జగదాంబల కుమార్తె మౌనిక వివాహానికి పుస్తె మెట్టెలు, చీర, గాజులను టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త అందజేయడం జరిగింది.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఉప్పల ఫౌండేషన్ ద్వారా అనేక పేద కుటుంబాలకు చెందిన వారికి పుస్తె మెట్టెలు, చీర, గాజులు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కావెలి రాములు తదితరులు పాల్గొన్నారు.