హస్తినాపురంలో శ్రీ చక్రేశ్వరి ఇంటర్నేషనల్ స్కూల్లో ఎస్ కే యం ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ప్రారంభం
రంగారెడ్డి: ఆగష్టు 16(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్లోని విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలనీ శ్రీ చక్రేశ్వరి ఇంటర్నేషనల్ స్కూల్లో జెండా ఆవిష్కరణ మరియు ఎస్ కే యం ఫైన్ ఆర్ట్స్ అకాడమీను ముఖ్య అతిథిగా విచ్చేసిన హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ చక్రేశ్వరి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ శ్రీనివాస చారి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు, సాంస్కృతిక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల వారు ఉత్సాహంగా ఉంటారని, వారిలో నైపుణ్యత బయటకు వస్తుందని తెలిపారు. తమ స్కూలు ఇంటర్నేషనల్ స్కూల్ అయినప్పటికీ స్కూల్ ఫీజు అందరికీ అందుబాటులో ఉండి, పేద మధ్య తరగతి విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఉంటుందన్నారు. తాము ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామని, వారంలో మూడు రోజులు డాన్స్ క్లాసులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ ప్రణవి, కాలనీ అసోసియేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.