భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు నిట్టు శ్రీశైలం
భువనగిరి: ఏప్రిల్ 3(భారత్ కి బాత్)
బుధవారం నాడు ఉదయం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పట్టణ కేంద్రంలో గడప గడపకు మోడీ అనే నినాదంతో ప్రచారం నిర్వహించిన బిజెపి రాష్ట్ర నాయకులు నిట్టు శ్రీశైలం. వివిధ కుల సంఘాల నాయకులు కలిసి సంపూర్ణ మద్దతును తెలియజేశారు. మద్దతును తెలియజేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. ఈ కార్యక్రమంలో బిజెపి క్రమశిక్షణ సంఘం సభ్యులు ప్రతాప్, ఇబ్రహీంపట్నం కౌన్సిలర్లు ముత్యాల భాస్కర్, నాయని సత్యనారాయణ, బిజెపి రాష్ట్ర నాయకులు నిట్టు శ్రీశైలం, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి అర్జున్ రెడ్డి, ఇబ్రహీంపట్నం బిజెపి మండల అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్షులు బూడిది నర్సింహారెడ్డి, కిసాన్ మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జక్క రవీందర్ రెడ్డి, యువమోర్చా నాయకులు రాఘవేందర్, వివిధ కుల సంఘాల నాయకులు, పలు పొదుపు సంఘాల నాయకురాళ్ళు తదితరులు పాల్గొన్నారు.