బడంగ్పేట్ మున్సిపాలిటీలో ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి: మార్చ్ 6(భారత్ కి బాత్)
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బడంగ్ పేట్ కొత్త మునిసిపల్ ఆఫీస్ వద్ద మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.
ఫ్రీ ఎల్ఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఛలో బడంగ్ పేట్ కు పెద్ద ఎత్తున తరలివచ్చిన బిఆర్ఎస్ శ్రేణులు, బాధితులు.
కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన మునిసిపల్ కార్యాలయం బిఆర్ఎస్ ధర్నాకు విశేష స్పందన, కదిలివచ్చిన ఎల్ఆర్ఎస్ భాదితులు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా ఉన్న వారందరూ ఎల్ఆర్ఎస్ అమలు ఉచితంగా చేయాలని డిమాండ్ చేసారని, మేము అధికారంలోకి వస్తే ఉచితంగా చేస్తామని, నేడు మార్చ్ నెలాఖరు వరకు గడువు పెట్టడం ఏమిటని, వాగ్దానాలు ఇచ్చి అమలు చేయకపోవటానికి ఇదొక్కటే పెద్ద ఉదాహరణ అని అన్నారు. గతంలో ప్రకటించిన విధంగా నేడు మాట తప్పకుండా ఉచితంగా అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎల్ఆర్ఎస్ బాధితులకు అండగా బిఆర్ఎస్ పార్టీ నిలుస్తుందన్నారు. అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందన్నారు.
నాడు ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నో ఎల్.ఆర్.ఎస్ నో టిఆర్ఎస్ అని పిలుపు నిచ్చారని, నేడు నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అని నినదించాలన్నారు.
ఎల్ఆర్ఎస్ క్రమబద్దీకరణ కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేయబోతే నాడు కాంగ్రెస్ అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగా భూములను క్రమబద్ధీకరణ చేస్తామని అన్నారు.
ఇప్పుడు ఎల్ఆర్ఎస్ మార్చి 31 లోపు కట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల రక్తం తాగుతోందని విమర్శించారు.
ప్రజల దగ్గర దోచుకోవడానికే ఎల్ఆర్ఎస్ పెట్టారని మంత్రి సీతక్క గారు అనలేదా..? అని ప్రశ్నించారు.
ప్రజల నుండి ఎల్ఆర్ఎస్ ద్వారా 20 వేల కోట్లు దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయిందన్నారు.
ప్రతిపక్షంలో వున్నప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చాక మరోలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు.
25 లక్షల కుటుంబాలపై ఎల్.ఆర్.ఎస్. భారం పడబోతోందని, ప్రభుత్వం వెంటనే ఉచితంగా ఈ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో గల బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మండలాల, మునిసిపాలిటీ, కార్పొరేషన్, డివిజిన్ల పార్టీ అధ్యక్షులు, కార్యవర్గాలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, మాజీ మార్కెట్ చైర్మన్ లు, మాజీ వైస్ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు, ఉద్యమకారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అనుబంధ సంస్థ నాయకులు, కార్యకర్తలు, ఎల్ఆర్ఎస్ బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.