Search for:
  • Home/
  • क्षेत्र/
  • అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవ వేడుకలు

అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవ వేడుకలు

అంబరాన్నంటిన మహిళల సంబరాలు

 

అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

 

మహిళలకు సామాజిక, ఆర్థిక సాధికారతతో పాటు రాజకీయ సాధికారతను సాధించాలి: రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త

 

హైదరాబాద్: మార్చ్ 6(భారత్ కి బాత్)

 

 

సోమవారం హైదరాబాద్ లోని నాగోల్, పిబిఆర్ కన్వెన్షన్ లో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఐవిఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి కార్యక్రమంలో భాగంగా ఆరు వేల మంది మహిళలు పాల్గొన్నారు.

 

ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం:

పది మంది పేదలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. అన్ని జిల్లా కేంద్రాలలో పదివేల మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది.

ఉచిత వైద్య శిబిరం: మెడికల్ క్యాంపు ద్వారా అందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. డెంటల్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేశారు.

తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఐవిఎఫ్ సేవాదళ్ చైర్మన్ బాలు గుప్త ఆధ్వర్యంలో ఇప్పటివరకు 2000 యూనిట్ల రక్తం తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందజేయడం జరిగింది.

ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదింటి అమ్మాయిలు ఇద్దరికీ పుస్తె, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా ఇవ్వడం జరిగింది. (హైదరాబాద్ కి చెందిన అమ్మాయి బ్రాహ్మణ కుటుంబం, తూప్రానికి చెందిన వైశ్యుల కుటుంబం అమ్మాయి) ఈ సందర్భంగా మహిళా మణులందరికి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

 

ఈ సందర్భంగా రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మగవాళ్ళకి ధీటుగా అన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటూ, మానవ జాతికి మహిళ ఒక వరమని, అలాగే మహిళా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆర్య వైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారని, ఇక ముందు కూడా అలాగే ఉండాలని అన్నారు. ఐవిఎఫ్ ఆధ్వర్యంలోఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రిలిమినరీ పాస్ అయి, ఐఏఎస్ చదువుతున్న 40 మందికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలిపారు. ఊర్లో బడి, గుడి, అన్నదానం, ఎటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు అయినా చేయడానికి ఆర్యవైశ్య సోదరులు, మహిళలు ముందుటారన్నారు. ఐవిఎఫ్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్నదానం, సత్రం, బడి, గుడి నిర్మాణంలో ఏదైనా కావచ్చు సేవా కార్యక్రమాలకు నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.

 

ఈ సందర్భంగా గంజి రాజమౌళి గుప్తా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కుటుంబ అభివృద్ధిలో గృహిణిగా స్త్రీ పాత్ర ఎంతో గొప్పదని, త్యాగపూరితమైందని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో గంజి రాజమౌళి గుప్తా, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, రమేష్, కాచిగూడ వైశ్య హాస్టల్ ప్రెసిడెంట్ ఉప్పల రాజేశ్వర్, నిలోఫర్ కేఫ్ బాబురావు, వాసవి సేవా కేంద్రం ప్రెసిడెంట్, కొత్తకోట ఎంపీపీ మౌనిక, ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ మొగలపల్లి ఉపేందర్, సురేందర్ గుప్త, రమేష్,గౌరిశెట్టి ప్రభాకర్, కూర నాగరాజు, ఎల్ వి కుమార్, యాంకర్ చంచల శర్మ, పొద్దుటూరి రాజేశ్వర్, యాంకర్ రవి లక్ష్మీవర్మ ఫిలిం యాక్టర్స్, పుడూర్ జడ్పీటీసీ మేఘమాల, ఐవిఎఫ్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, ఐవిఎఫ్ రాష్ట్ర కమిటీ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్రశేఖర్, కటకం శ్రీనివాస్, ఐవిఎఫ్ యూత్ ప్రెసిడెంట్ కట్ట రవికుమార్, కాచం రాజశేఖర్ గుప్త, నరేష్ గుప్తా, ఐవిఎఫ్ వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ రొంపల్లి సంతోష్ కుమార్, వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ పుల్లూరు మధు, చింతల రజనీకాంత్, మంజుల, ఐవిఎఫ్ మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ పాండు గుప్త, మెదక్ జిల్లా ప్రెసిడెంట్ ఉప్పల నరసింహులు ,ఐవిఎఫ్ చీఫ్ అడ్వైసర్ మణిమాల, ఐవిఎఫ్ సేవాదళ్ చైర్మన్ బాలు గుప్త, ఇతర నాయకులు, ఐవిఎఫ్ రాష్ట్ర కమిటీ, జిల్లా, మండల కమిటీ అన్ని విభాగాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required