రైల్వే అండర్ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మర్రి రాజశేఖర్ రెడ్డి, నందికంటి శ్రీధర్
మల్కాజిగిరి: ఫిబ్రవరి 26(భారత్ కి బాత్)
సోమవారం నాడు మల్కాజిగిరి నియోజకవర్గం 133 మచ్చ బొల్లారం డివిజన్ తుర్కపల్లి రైల్వే గేట్ ఎల్ సి 249 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నందికంటి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు, రైల్వే ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.