సోమవారం నిర్వహించనున్న బిజెపి విజయ సంకల్ప యాత్ర సన్నాహక సమావేశం: దాయం భూపాల్ రెడ్డి
నల్గొండ: ఫిబ్రవరి 25(భారత్ కి బాత్)
సోమవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు బిజెపి నల్గొండ జిల్లా కార్యాలయం నందు బిజెపి విజయ సంకల్ప యాత్ర నల్గొండ నియోజకవర్గానికి మార్చి 1వ తేదీన చేరుకుంటుంది. కావున సోమవారం నల్లగొండలో అసెంబ్లీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశానికి బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్, నల్లగొండ అసెంబ్లీ ప్రభారీ ఆర్. ప్రదీప్ కుమార్ విచ్చేయనున్నారు. కావున నల్గొండ నియోజకవర్గంలోని బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు అందరూ ఈ యొక్క సమావేశానికి రాగలరని నల్గొండ అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి కోరారు.