Search for:

నూతనంగా ప్రారంభమైన ఫార్మ్ 2 కిచెన్

విశ్రాంత డిఫెన్స్ ఉద్యోగులు నేటి యువతరానికి ఎంతో ఆదర్శం

 

ఫిట్ ఇండియా హెల్తి ఇండియా అని అంటున్న వ్యవస్థాపకులు 

 

నాచురల్ ఫార్మ్ ప్రొడక్ట్స్ మిల్లెట్స్ 

 

రంగారెడ్డి: ఫిబ్రవరి 14(భారత్ కి బాత్)

 

సరూర్ నగర్ మండలంలోని కర్మాన్ ఘాట్ జడ్పీ రోడ్ లో నందనవనం కాలనీ పక్కన ప్లాట్ నెంబర్ 180 లో ఫార్మ్ 2 కిచెన్ (నాచురల్ ఫార్మ్ ప్రొడక్ట్స్) ను బుధవారం నాడు ఘనంగా ప్రారంభించారు. 13 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విశ్రాంత సభ్యులు బజ్జురి రామారావు, సిహెచ్ శ్రీనివాస్ గౌడ్, జింక శేషాద్రి, రఘు రాములు గౌడ్, ఎం. శ్రీనివాస్, కె. శివాజీ, బి. మహేష్, శశివర్ధన్ రెడ్డి, నరేష్ రెడ్డి, జగదీష్ కుమార్, పీవీ విజయ భాను, చెరుకూరి హరిబాబు, బండారి రమేష్ లు కలిసి ఫార్మ్ 2 కిచెన్ ను స్థాపించారు. ఈ సందర్భంగా బి. రామారావు మాట్లాడుతూ రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీని సందర్శించి, ఆల్ ఇండియా లెవెల్ లో జరిగిన సమ్మిట్ లో పాల్గొని, మనదేశంలో పండించే ప్రతి పంట కెమికల్స్ తో పండిస్తున్నారని తెలిపారు. ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 27, 2023 న సైనిఖేతిహార్ (జై జవాన్ జై కిసాన్) ను స్థాపించామని పేర్కొన్నారు. ఫెర్టిలైజర్స్, కెమికల్స్ వల్ల పండించే పంట వల్ల ఈ రోజుల్లో 25, 30 సంవత్సరాలు కూడా నిండకుండానే ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నారని జుట్టు రాలడం, బీపీ, షుగర్లు, హార్ట్ ఎటాక్ లు రావడం, ఈ అనారోగ్యo బారిన పడకుండా ఉండాలంటే, కెమికల్స్ వాడకుండా పంటలను పండించి అటు పేద రైతులకి, ఇటు ప్రజలకి లబ్ధి చేకూర్చి, అందరూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడమే మా లక్ష్యమని అన్నారు.

 

కరోనా కాలంలో డెల్టా వేరియంట్ వల్ల ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్లు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉన్నవాళ్లు జీవించగలిగారని, అందుకే అందరూ మంచి ఆహారాన్ని తీసుకొని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు ఫిట్ ఇండియా హెల్తి ఇండియాను ప్రజల్లోకి తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని, ప్రజలందరు మమ్మల్ని ఇలాగే ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నామన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required