Search for:
  • Home/
  • क्षेत्र/
  • కొత్తపేటలో నూతనంగా ప్రారంభమైన బ్రౌన్ బేర్ బేకరీ

కొత్తపేటలో నూతనంగా ప్రారంభమైన బ్రౌన్ బేర్ బేకరీ

హైదరాబాద్: ఫిబ్రవరి 7(భారత్ కి బాత్)

 

బ్రౌన్ బేర్ బేకర్స్ 31వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని కొత్తపేటలో నాగోల్ రోడ్ లో సంతోష్ హోటల్ పక్కన బుధవారం నాడు ప్రారంభించడం జరిగినది.  విభిన్న వ్యాపార నేపథ్యాలు కలిగిన నలుగురు వ్యవస్థాపకులతో బ్రౌన్ బేర్ బేకరీని స్థాపించారు. డైరెక్టర్లు సోహిల్ లఖానీ, రహీమ్ కొటాడియా, సులేమాన్ లఖానీ మరియు రోహిల్ రెమానీలు మాట్లాడుతూ బ్రాండ్ 2024 చివరి నాటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా 50కి పైగా అవుట్‌లెట్‌లను లక్ష్యంగా చేసుకున్నామని, మరింత విస్తరించేందుకు ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను కలిగియున్నామని పేర్కొన్నారు. నాణ్యమైన పదార్థాలు, ఖచ్చితమైన బేకింగ్ మరియు అంతర్జాతీయంగా బ్రాండ్ యొక్క నిబద్ధతను తెలియజేస్తుందని తెలిపారు.

బ్రౌన్ బేర్ యొక్క మెనూ, బ్రెడ్, మఫిన్‌లు, డోనట్స్, కేక్స్ మరియు మరిన్నింటిని కలిగియుందని, 31 అవుట్‌లెట్‌లలో మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 300 లకు పైగా ప్రీమియం మల్టీ-చైన్ రిటైల్ సూపర్ మార్కెట్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. త్వరలోనే హోమ్ డెలివరీ అలాగే ఆన్లైన్ డెలివరీ కూడా ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు, ప్రొప్రైటర్ తులసీదేవి, పుష్ప మూవీ యాక్టర్ దయానంద్ రెడ్డి, బలగం మూవీ యాక్టర్ ఏకే 47 ఫేమ్, లీడ్ సీరియల్ యాక్టర్ మాధవి, సీరియల్ ప్రొడ్యూసర్ మరియు యాక్టర్ శివ, సినీ యాక్టర్స్, స్నేహితులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required