బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకో
కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్
రంగారెడ్డి: ఫిబ్రవరి 6(భారత్ కి బాత్)
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంచిర్యాలలో జరిగిన బీ.ఆర్.ఎస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్ పేర్కొన్నారు. మంగళవారం నాడు విజయ్ రాథోడ్ మాట్లాడుతూ బాల్క సుమన్ తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే తగిన రీతిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తనను చిత్తు చిత్తుగా ఓడించారని, అయినా తనకు బుద్ది రాలేదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ తనకు ఎంపీ టిక్కెట్ ఇస్తారనే ఆశతోనే బాల్క సుమన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాల్క సుమన్ కు తగిన శాస్తి చెప్తారని తెలిపారు.