ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి
రంగారెడ్డి: ఫిబ్రవరి 2(భారత్ కి బాత్)
ప్రజా సమస్యల పరిష్కారానికి జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ, విలేకరుల సమక్షంలో ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు జిహెచ్ఎంసి కౌన్సిల్‌ను నిర్వహించాలని, అలాగే జిహెచ్ఎంసిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సెక్రటేరియట్ లోని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎయుడి దానకిషోర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగిందని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి తెలిపారు.