ప్రతి సోమవారం అందరు చేనేత వస్త్రాలు ధరించాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త
రంగారెడ్డి: జనవరి 29(భారత్ కి బాత్)
ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించి, చేనేత వస్త్రాలకు, ప్రాధాన్యం ఇవ్వాలనే సదుద్దేశంతో చేనేత కార్మిక రంగానికి, చేనేత కార్మికులకు సామాజిక న్యాయం చేయడానికి, ఉపాధి కల్పించే దిశగా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించడం జరుగుతుందని, అందులో భాగంగానే సోమవారం నాడు కూడా చేనేత వస్త్రాలు ధరించడం జరిగిందని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు.