పార్కుల ఆవశ్యకత ఎంతో ఉంది: మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి: జనవరి 11(భారత్ కి బాత్)
కాంక్రీట్ జంగల్ గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో పార్కుల ఆవశ్యకత ఎంతో ఉందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు జల్ పల్లి మునిసిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఆడుకుంటున్న చిన్నారులతో మాట్లాడారు. సౌకర్యాలపై అరా తీశారు. మంత్రిగా ఉన్నప్పుడు దూరదృష్టితో పార్కులో ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలు, వాకింగ్ ట్రాక్ లాంటి వాటిని నేడు నిత్యం వందలాది మంది ఉపయోగించుకుంటున్నారని అక్కడకు వచ్చిన వారు తెలిపారని అన్నారు. పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్న పెద్దలు సేద తీరటానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ సందర్భంగా వారు సబితమ్మకు ధన్యవాదాలు తెలిపారు. రోజురోజుకు రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో మరింతగా పార్కును విస్తరించటానికి కృషి చేస్తానన్నారు. ఇప్పటికే నియోజకవర్గములోని అర్బన్ పార్కులను ప్రజలకోసం తీర్చిదిద్దినట్లు తెలిపారు. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వెంట మునిసిపల్ చైర్మన్ అబ్దుల్లా సాధి, నాయకులు యూసుఫ్ పటేల్, కౌన్సిలర్ శంషోద్దీన్, నాయకులు ఉన్నారు.