కొత్తపేటలో నూతనంగా ప్రారంభమైన పల్లవీస్ ధన్వంతరి క్లినిక్
హైదరాబాద్: ఫిబ్రవరి 3(భారత్ కి బాత్)
కొత్తపేటలో అష్టలక్ష్మి టెంపుల్ కమాన్ రత్నదీప్ పక్క వీధిలో సోమవారం నాడు పల్లవీస్ ధన్వంతరి క్లినిక్ ను నాగోల్ కార్పొరేటర్ అరుణ సురేందర్ యాదవ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమాని డాక్టర్ టి. పల్లవి మాట్లాడుతూ ఆయుర్వేదిక్ క్లినిక్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఈ చుట్టుపక్కల ఏరియాలో ఆడవారికి ఫైల్స్ మరియు ఫిస్టులా కోసం సరిగ్గా లేడీ డాక్టర్ అందుబాటులో లేరని పేర్కొన్నారు. అలాగే పేషెంట్ల కొరకు మైనర్ సర్జరీ ఫిషరీస్, ఫిస్టులా అలాగే ఒబేసిటీ కొరకు కూడా పూర్తి ఆయుర్వేద వైద్యం అందుబాటులో ఉందని, గైనిక్ సేవలు, స్కిన్ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, ఆస్తమా అలాగే డయాబెటిస్, గ్యాస్టిక్ సమస్యలు గూర్చి ఆయుర్వేద వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అరుణ సురేందర్ యాదవ్, రాధా, టి. వంశీ కృష్ణ, టీ. ఆల్వార్ స్వామి, విజయ లక్ష్మి, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. పల్లవీస్ ధన్వంతరి క్లినిక్ సేవల కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 7702530680.